News April 21, 2024

NLG: RTC డ్రైవర్ సూసైడ్ అటెంప్ట్.. సజ్జనార్ ట్వీట్

image

దేవరకొండ RTC డిపో డ్రైవర్ శంకర్ ఆత్మహత్యాయత్నం ఘటనపై RTC ఎండీ సజ్జనార్ స్పందించారు. RTC అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్యాయత్నం చేసుకున్నారని వస్తోన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ డ్రైవర్ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఈ నెల 18, 19 తేదీల్లో విధులకు గైర్హాజరయ్యారు. అయినా ఈ నెల 20న అధికారులు డ్యూటీ కేటాయించారు. డ్రైవర్ శంకర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారంటూ సజ్జనార్ ట్వీట్ చేశారు.

Similar News

News November 14, 2025

NLG: చదువే ధ్యేయంగా బాలికలు ముందుకు సాగాలి: కలెక్టర్

image

బాలికలు చదువునే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని, ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు సాగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం నల్గొండ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

News November 14, 2025

NLG: చేప పిల్లలు నాసిరకం: మత్స్యకారులు

image

జిల్లాలో చేప పిల్లల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. చెరువులు, కుంటలకు పూర్తిగా నాసిరకం సీడ్‌ వస్తున్నదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 6 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేయనుండగా.. ఇప్పటివరకు 60 లక్షలకు పైగానే చేప పిల్లలు పంపిణీ చేశారు. జిల్లాలోని ముత్యాలమ్మ చెరువు, కోతకుంట, ఉంగూరుకుంట చెరువులకు పంపిణీ చేసిన చేప పిల్లలు నాసిరకంగా ఉన్నాయని మత్స్యకారులు ఆరోపించారు.

News November 14, 2025

NLG: 17 నుంచి పత్తి కొనుగోలు బంద్

image

సీసీఐ తీరుపై మరోసారి కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతులతోపాటు కాటన్ మిల్లులను ఇబ్బందులకు గురిచేసేలా పత్తి కొనుగోళ్లల్లో కఠిన నిబంధనలను సడలించాలన్న విజ్ఞప్తిని సీసీఐ పట్టించుకోకపోవడంతో మరోసారి ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈనెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు కాటన్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రకటించింది.