News March 25, 2025

NLG: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

image

SLBC టన్నెల్‌లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> UPలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

Similar News

News January 7, 2026

చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీల షెడ్యూల్ ఇదే

image

ఈ నెలలో జరగనున్న చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26, క్రీడా పోటీలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. 17వ తేదీ నుంచి 22 వరకు గ్రామ స్థాయిలో, 28 నుంచి 31 వరకు మండల స్థాయి, ఫిబ్రవరి 3 నుంచి 7వరకు నియోజకవర్గ స్థాయిలో, ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. క్రీడాకారుల ప్రతిభను పెంపొందించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరగనున్నాయి.

News January 7, 2026

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ పూర్తయిందని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

News January 7, 2026

ధరణి చిక్కుముడులు వీడాలి: కలెక్టర్

image

నల్లగొండ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు సత్వరమే పరిష్కరించి, బాధితులకు ఊరటనివ్వాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సాదాబైనామాల క్రమబద్ధీకరణ, భూ రికార్డుల సవరణ ప్రక్రియలో వేగం పెంచాలని సూచించారు. వివాదాల పరిష్కారంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.