News March 25, 2025
NLG: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

SLBC టన్నెల్లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> UPలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News December 10, 2025
రంప: డిప్యూటీ డైరెక్టర్కు షోకాజ్ నోటీసు?

రంపచోడవరం గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రుక్మాంగదయ్యకు ITDA పీవో స్మరణ్ రాజ్ షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. గోకవరం పోస్ట్ మెట్రిక్ బాలుర వసతి గృహం వార్డెన్గా పని చేస్తున్న సంబుడును పీఓ అనుమతి లేకుండా రంపచోడవరం సహాయ గిరిజన సంక్షేమాధికారిగా నియమించినందుకుగాను నోటీసు జారీ చేసినట్లు సమాచారం. ఎస్టీ కమిషన్ చైర్మన్ బొజ్జిరెడ్డి ITDA POకు ఫిర్యాదు చేయడంతో నోటీసు అందజేశారని తెలిసింది.
News December 10, 2025
తిరుపతి: పరీక్ష ఫీజు చెల్లించేందుకు అవకాశం.!

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(BRAOU) పరిధిలో M.B.A, M.LI.Sc విద్యార్థులు PG మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షా ఫీజు చెల్లించాలని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కో-ఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పరీక్ష ఫీజు చెల్లించడానికి డిసెంబర్ 22 చివరి తేదీ అని చెప్పారు. మరిన్ని వివరాలకు www.braouonline.in వెబ్సైట్ చూడాలని సూచించారు.
News December 10, 2025
గన్నవరం: ఇసుక కుప్ప కాదండి.. రంగు మారిన ధాన్యం..!

పై ఫోటోలో మీకు కనిపిస్తున్నది ఇసుక కుప్ప అనుకుంటున్నారు కదూ. కానే కాదు.. అది రంగు మారిన ధాన్యం రాశి. గత మొంథా తుఫాను వరదలో నానిన వరి చేను నూర్చారు. గన్నవరం మండలం పురుషోత్తపట్నం గ్రామంలో ఇలా రంగు మారిన ధాన్యం రాశులు చూడొచ్చు. రైతులు 75 కిలోల బస్తా రూ.1300 చొప్పున వ్యాపారికి బుధవారం విక్రయించారు. ఈ విధంగా బస్తాకు వెయ్యి రూపాయలు చొప్పున రైతులకు నష్టాలు మిగిల్చింది తుఫాను.


