News March 25, 2025
NLG: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

SLBC టన్నెల్‌లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> UPలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Similar News
News March 29, 2025
నల్గొండ: ముగ్గురు పిల్లలు మృతి

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు మృతిచెందిన విషయం తెలిసిందే.<<>> RR జిల్లా తలకొండపల్లికి చెందిన చెన్నయ్య 2012లో నల్గొండ జిల్లా మందాపూర్ వాసి రజితను పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం పొద్దున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.
News March 29, 2025
రంజాన్ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ఏర్పాట్ల పరిశీలన

రంజాన్ పండుగ సందర్భంగా నల్లగొండలోని ఈద్గా వద్ద డీఎస్పీ శివరామిరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగ జరుపుకోవాలని కోరారు. ఈద్గా కమిటీ వైస్ ఛైర్మన్ డాక్టర్ ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ పరిశుభ్రమైన వాతావరణంలో ఎండ వేడిమి, దృశ్య తాగునీరు, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారుఈ కార్యక్రమంలో సీఐ రాజశేఖర్ రెడ్డి, ఈద్గా సెక్రటరీ ఫుర్ఖాన్ పాల్గొన్నారు.
News March 28, 2025
పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేవీఆర్

నల్గొండ మున్సిపల్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి శుక్రవారం సమీక్షించారు. వేసవి దృష్ట్యా విద్యుత్ సేవలు, సాగు నీరు, త్రాగు నీరు వంటి అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.