News April 4, 2025
NLG: TCC కోర్స్ వేసవి శిక్షణ శిబిరం

టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ వేసవి శిక్షణ శిబిరాన్ని మే 1 నుంచి జూన్ 11 వరకు నిర్వహించనున్నట్లు డీఈవో బొల్లారం బిక్షపతి తెలిపారు. నల్గొండలోని డైట్ ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, కర్నాటిక హిందుస్థాని సంగీతం, వుడ్ వర్క్ కోర్సులలో శిక్షణ ఇస్తామన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 17 నుంచి 29 వరకు డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News April 8, 2025
ఏసీబీ వలలో చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి

చింతలపాలెం ఎస్సై అంతిరెడ్డి ఏసీబీ వలలో చిక్కాడు. ఓ వ్యక్తి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఎస్సై ఏసీబీకి చిక్కడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎస్సై అంతిరెడ్డి నార్కెట్‌పల్లిలో పనిచేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 8, 2025
NLG: రైతులను వేధిస్తున్న సర్వేయర్ల కొరత

జిల్లా వ్యాప్తంగా సర్వేయర్ల కొరత ఉండడంతో సమస్యలు ఎక్కడికక్కడే పేరుకుపోతున్నాయి. సర్వేకు దరఖాస్తు చేసుకున్న బాధితులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. భూ తగాదాలు తీరాలన్న.. గట్టు పంచాయతీలు వచ్చిన భూ సర్వే చేసి పరిష్కరిస్తారు. కాగా జిల్లాలో సర్వేయర్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో సకాలంలో సేవలు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 8, 2025
నల్గొండ జిల్లాలో 40 డిగ్రీల దాటిన ఎండ !

నల్లగొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సోమవారం 40.01 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం సమయంలో జిల్లాలోని ప్రధాన రహదారులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. నల్గొండ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.