News March 18, 2024

NLG: నేటి నుంచి టెన్త్ పరీక్షలు.. సెంటర్ల వద్ద 144 సెక్షన్‌

image

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నేటి నుంటి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. నల్గొండ జిల్లాలో మొత్తం 109 పరీక్ష కేంద్రాల్లో 19,715 మంది, సూర్యాపేటలోని 76 సెంటర్లలో 12,133 మంది, యాదాద్రిలో 51 సెంటర్లలో 9130 మంది పరీక్ష రాయనున్నారు. దీంతో సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమలుతోపాటు పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని డీఈఓ బిక్షపతి సూచించారు.

Similar News

News November 7, 2025

దామరచర్ల: పత్తి చేనులో పుర్రె, ఎముకలు

image

దామరచర్ల మండలం తాళ్లవీరప్పగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు వ్యవసాయ పొలంలో మనిషి పుర్రె, ఎముకలు కనిపించిన ఘటన శుక్రవారం కలకలం రేపింది. పత్తి తెంపడానికి వచ్చిన కూలీలు పుర్రె, ఎముకలు చూసి పొలం యజమానికి తెలపడంతో యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News November 7, 2025

నల్గొండలో ర్యాగింగ్‌పై కలెక్టర్‌ ఆరా

image

నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ జరిగిందంటూ మీడియాలో వచ్చిన వార్తలపై కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆరా తీశారు. ఆమె అదనపు కలెక్టర్, ఆర్డీఓతో కలిసి కళాశాలను సందర్శించారు. విద్యార్థులు, ప్రిన్సిపల్‌తో విడివిడిగా మాట్లాడిన కలెక్టర్, తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో ఉన్నట్లు చర్చల్లో తెలిసిందని ఆమె పేర్కొన్నారు.

News November 7, 2025

NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

image

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.