News April 3, 2025
NLG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ITI, డిప్లొమా, NCC కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic. వెబ్సైట్లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 04027740205 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News April 4, 2025
భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాల పంపిణీ

హైదరాబాద్ సైబర్ గార్డెన్లో నల్గొండ జిల్లా వీర్లపాలానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరై ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
News April 4, 2025
NLG: పారితోషికం కోసం ఎదురుచూపు

రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే వివరాలను ఆన్లైన్లో పొందుపర్చిన డాటా ఎంట్రీ ఆపరేటర్లకు నేటికీ పారితోషికం అందలేదు. జిల్లా వ్యాప్తంగా మొత్తం సుమారు 3000 మందికి పైగానే డాటాఎంట్రీ ఆపరేటర్లను నియమించారు. వారికి పారితో కింద ఒక్కో ఫామ్ వివరాలు ఆన్లైన్లో నమోదు చేసినందుకు రూ.25 ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది. కానీ నేటి వరకు పారితోషికం అందించలేదని ఆపరేటర్లు తెలిపారు.
News April 4, 2025
NLG: అగ్రిగోల్డ్ మోసానికి పదేళ్లు

ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట దక్కడం లేదు. ఉమ్మడి జిల్లా నుంచి అగ్రిగోల్డ్ సంస్థ రూ.వందల కోట్ల డిపాజిట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అయితే లాభాలు ఇవ్వకుండా మోసం చేయడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో 2015లో కేసులు నమోదు చేశారు. జిల్లాలో సుమారు వేల సంఖ్యలో బాధితులు, ఏజెంట్లు ఉన్నారు. సుమారు 10 ఏళ్లు కావస్తున్నా.. బాధితులకు నేటికీ చిల్లి గవ్వ ఇవ్వకపోవడంతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి.