News January 28, 2025

NLG: ఉపాధి అవకాశాల కోసం ‘DEET ‘

image

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ యాప్‌ను ప్రారంభించినట్లు NLG ఉపాధి కల్పన అధికారి పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ఈ ఆన్‌లైన్ యాప్లో నిరుద్యోగులు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నమోదు చేసుకోవచ్చన్నారు.

Similar News

News March 13, 2025

నల్గొండలో రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

రేపు నల్గొండ జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 6గంటలకు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం అమనగల్‌కు చేరుకుంటారు. అనంతరం శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థాన జాతరలో పాల్గొని పార్వతీపరమేశ్వరులకు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు అమనగల్ నుంచి బయలుదేరి రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు.

News March 13, 2025

ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు ధ్రువీకరణ పత్రం

image

ఎమ్మెల్సీగా ఎన్నికైన నెల్లికంటి సత్యంకు అసెంబ్లీ ఆవరణలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి గురువారం ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

News March 13, 2025

నలుగురు నల్గొండకు చెందినవారే..!

image

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఎమ్మెల్సీలుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీలుగా ఎంపికైన ఐదుగురిలో విజయశాంతి తప్ప మిగతా నలుగురు నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం విశేషం.

error: Content is protected !!