News February 19, 2025

NLG: ఊపందుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు ఊపందుకున్నది. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు ఉమ్మడి జిల్లాలో పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. కాగా యూటీఎఫ్ తరఫున మరోసారి బరిలోకి దిగిన నర్సిరెడ్డికి వామపక్షాలు మద్దతిస్తున్నాయి.

Similar News

News February 21, 2025

ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ త్రిపాఠి

image

వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్, వరంగల్ -ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి తెలియజేశారు. శుక్రవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News February 21, 2025

చింతపల్లి: పెళ్లింట తీవ్ర విషాదం

image

మనవరాలి పెళ్లికి పందిరి వేసేందుకు చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా చెట్టు పైనుంచి జారిపడి వృద్ధుడు మృతి చెందిన ఘటన చింతపల్లి మం.లో జరిగింది. ధైర్యపురితండాకు చెందిన బాలయ్య(65) మనవరాలి వివాహం శుక్రవారం జరగనుండగా.. పందిరి వేసేందుకు గురువారం తమ పొలానికి సమీపంలో చెట్టు ఎక్కి కొమ్మలు కొడుతుండగా జారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.

News February 21, 2025

తిప్పర్తి: కరెంట్ షాక్‌తో చెట్టు మీదే వ్యక్తి మృతి

image

కరెంట్ షాక్‌తో మేకల కాపరి మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలంలోని మర్రిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాషా(48) మేకల కాపరిగా జీవనం కొనసాగిస్తున్నాడు. వాటి మేత కోసం తుమ్మచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి చెట్టు మీదనే మృతి చెందాడు.

error: Content is protected !!