News March 20, 2025
NLG: ఎంబ్రాయిడరీ వర్క్‌లో మహిళలకు ఉచిత శిక్షణ

నల్గొండ శివారులోని SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో గ్రామీణ నిరుద్యోగ మహిళలకు మార్చి 24 నుంచి మగ్గం వర్క్ (ఎంబ్రాయిడెరీ)లో 30 రోజుల ఉచిత శిక్షణ అందజేస్తున్నామని సంస్థ డైరెక్టర్ రఘుపతి తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత టూల్ కిట్, వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు. 18 సం. నుంచి 45 సంవత్సరాలలోపు ఉమ్మడి నల్గొండకు చెందిన వారు అర్హులని, ఆసక్తి గల వారు మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News March 21, 2025
నల్గొండ: DSPకి ప్రశంసా పత్రం

రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసినందుకు గాను నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. దీంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని డీఎస్పీ అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు.
News March 21, 2025
NLG: విద్యార్థుల్లారా.. విజయీభవ..!

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 105 కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 18,925 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా టెన్త్ క్లాస్ విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకుని పరీక్షలు ప్రశాంతంగా రాయాలన్నారు.
News March 21, 2025
నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్‌లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.