News February 25, 2025

NLG: ఎత్తుకు పైఎత్తులు.. మిగిలింది ఒక్కరోజే!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ప్రచారానికి ఒక్క రోజే మిగిలి ఉండటంతో ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కొంతమంది తాయిలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాగా కొంతమంది అభ్యర్థులు రెండో ప్రాధాన్యత ఓట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.

Similar News

News February 25, 2025

లిక్కర్ పాలసీతో రూ.2వేల కోట్ల నష్టం: ఢిల్లీ సీఎం

image

ఆప్ సర్కార్ 2021-22లో తెచ్చిన లిక్కర్ పాలసీ కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ నివేదిక వెల్లడించిందని సీఎం రేఖా గుప్తా తెలిపారు. లిక్కర్ వ్యాపారాన్ని సులభతరం చేయడం, ఏకఛత్రాధిపత్యాన్ని అడ్డుకోవడం కోసం తెచ్చిన ఈ విధానం దాని లక్ష్యాలను అందుకోలేకపోయిందని పేర్కొన్నారు. లైసెన్సుల జారీలో నిబంధనలను ఉల్లంఘించారని, నిపుణుల అభిప్రాయాలు తీసుకోలేదని వివరించారు.

News February 25, 2025

CT: పాక్ పరిస్థితిపై క్రికెట్ ఫ్యాన్స్ సెటైర్లు

image

29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ టోర్నీ రేస్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జట్టుపై క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ‘టోర్నీ నుంచి తప్పుకున్నా ఆతిథ్యం ఇవ్వడం.. చోరీకి గురైన ఫోన్‌కు ఈఎంఐలు కట్టడం లాంటిదే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత్, న్యూజిలాండ్‌పై పాక్ ఓటమి పాలవ్వగా బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడాల్సి ఉంది.

News February 25, 2025

మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

image

TG: నిరుద్యోగ మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ద్వారా ఉచితంగా ఈవీ ఆటో, టూ వీలర్ డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనుంది. 18-45 ఏళ్ల మహిళలకు 45-60 రోజుల పాటు శిక్షణ అందించనున్నట్లు పేర్కొంది. డ్రైవింగ్ నేర్చుకున్న మహిళలకు సబ్సిడీపై ఈవీ ఆటోలు అందివ్వనున్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 45 మందికి ట్రైనింగ్ ఇవ్వగా.. వచ్చే నెల 5 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ కానుంది.

error: Content is protected !!