News April 2, 2025
NLG: కేవీలో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ

నల్గొండలోని కేంద్రియ విద్యాలయంలో 2 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు నేటి నుంచి దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రిన్సిపల్ శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తులను కేంద్రియ విద్యాలయ కార్యాలయంలో బుధవారం ఉదయం 9 నుంచి 12 వదకు పొందాలని పేర్కొన్నారు. పూరించిన దరఖాస్తులను ఈ నెల 11లోగా విద్యాలయంలో అందజేయాలన్నారు. టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు కేంద్రియ నిబంధనల ప్రకారం అర్హత ఉంటుందని తెలిపారు.
Similar News
News April 4, 2025
తిర్యాణి: యాక్సిడెంట్.. యువకుడి దుర్మరణం

నార్నూర్ మండలం గంగాపూర్‌లో ఎంగేజ్మెంట్‌కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పుసిగూడ ఘాట్ వద్ద జరిగిన యాక్సిడెంట్‌లో యువకుడు దుర్మరణం చెందారు. యువకుడిని ఆటోలో ఉట్నూర్ ఆసుపత్రికి తరలించగా మృతిచెందారు. మృతుడు తొడసం జంగుగా గుర్తించారు. తిర్యాణి మండలం సుంగాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడికి భార్య పిల్లలు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 4, 2025
IPL: గుజరాత్ టైటాన్స్‌కు స్టార్ పేసర్ దూరం

నిన్న RCBపై గెలిచి ఆనందంలో ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బ్యాడ్‌న్యూస్. ఆ టీమ్ స్టార్ పేసర్ కగిసో రబాడా వ్యక్తిగత కారణాల వల్ల స్వదేశం వెళ్లిపోయారు. అతడు మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడనే విషయాన్ని GT వెల్లడించలేదు. పంజాబ్, ముంబైపై ఆడిన రబాడా రెండు వికెట్లు మాత్రమే పడగొట్టారు. నిన్న RCBతో మ్యాచ్‌కు తుది జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు. GT తన తర్వాతి మ్యాచ్‌లో ఈనెల 6న SRHతో తలపడనుంది.
News April 4, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

ఈనెల 7 నుంచి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరవాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఇన్‌ఛార్జులు, ఏపీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వరి ఏ గ్రేడ్ రకానికి రూ.2,320, బి గ్రేడ్ రకానికి రూ.2,300 ధర నిర్ణయించినట్లు వెల్లడించారు.