News April 7, 2025
NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
Similar News
News April 14, 2025
NLG: పత్తి సాగు ప్రశ్నార్ధకమేనా?

నల్గొండ జిల్లాలో పత్తి రైతుపై ధరల పిడుగు పడింది. రానున్న వర్షాకాలం ప్రారంభానికి ముందే విత్తన కంపెనీలు అమాంతం ధరలు పెంచేశాయి. దీంతో ఇప్పటికే అతివృష్టి, అనావృష్టితో నష్టాలు చవిచూస్తున్న రైతులపై ఆర్థిక భారం మరింత పడనుంది. దీంతో పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2019లో ప్యాకెట్‌ధర రూ.710 ఉండగా ప్రస్తుతం 901కి చేరడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News April 14, 2025
NLG: మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నల్గొండ వాసి!

నల్లగొండ వాసికి అత్యున్నత పదవి లభించింది. హైకోర్ట్ న్యాయమూర్తిగా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. NLGకి చెందిన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు.
News April 14, 2025
NLG: నిందితుల కోసం పోలీసుల గాలింపు

నల్లగొండ జిల్లా కేంద్రంలో సంచలనం రేపిన మణికంఠ ఫొటో కలర్ ల్యాబ్ యజమాని గద్దపాటి సురేశ్ హత్య కేసు విచారణ కొనసాగుతోంది. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిందితులను పట్టుకునేందుకు నాలుగు టీమ్‌లు గాలింపు చర్యలు చేపట్టాయి. టూటౌన్ పోలీసులు అనుమానితులతో పాటు హత్యకు ముందు మృతుడితో ఫోన్లో మాట్లాడిన వారిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం.