News February 25, 2025
NLG: క్విజ్.. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే!

☞ఎవరికాలంలో నల్గొండ <<15559631>>నీలగిరిగా <<>>ప్రసిద్ధి చెందింది? – శాతవాహనులు
☞భూదానోద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? – ఆచార్య వినోబా భావే
☞దేశోద్ధారక గ్రంథమాలను ఎవరు స్థాపించారు? – వట్టి కోట ఆళ్వారుస్వామి
☞రావి నారాయణరెడ్డి జన్మస్థలం? – భువనగిరి మం. బొల్లేపల్లి
☞‘పల్లెటూరి పిల్లగాడ’ పాటను ఎవరు రచించారు? – సుద్దాల హనుమంతు
SHARE IT..
Similar News
News January 2, 2026
మారేడుబాక: విద్యార్థి గీసిన చిత్రాన్ని చూసి మురిసిపోయిన కలెక్టర్

మారేడుబాకలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి విచ్చేసిన కలెక్టర్ చేకూరి కీర్తికి అపురూపమైన కానుక లభించింది. స్థానిక ఎంపీఎస్ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని మానేపల్లి కీర్తి, కలెక్టర్ చిత్రాన్ని పెన్సిల్ ఆర్ట్‌తో అప్పటికప్పుడు చిత్రీకరించి అందజేశారు. విద్యార్థిని ప్రతిభను చూసి మురిసిపోయిన కలెక్టర్, ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పెన్సిల్ చిత్రపటం అక్కడి వారందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
News January 2, 2026
జాతీయస్థాయి KHO-KHO పోటీలకు పాలమూరు క్రీడాకారిణి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కర్ని ప్రభుత్వ పాఠశాల క్రీడాకారిణి శశిరేఖ జాతీయస్థాయి ఖో-ఖో పోటీలకు ఎంపికైందని జీహెచ్ఎం వెంకటయ్య, పీడీ బి.రూప ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. గత నెలలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన 44వ జూనియర్ రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయస్థాయికి ఎంపికైందన్నారు. బెంగళూరులో ఈ నెల 4 నుంచి ప్రారంభమయ్యే 44వ జాతీయ స్థాయి జూనియర్ ఖో-ఖో పోటీలలో పాల్గొంటుందన్నారు.
News January 2, 2026
వరంగల్ కమిషనరేట్‌లో 148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై వరంగల్ పోలీసులు నిఘా పెంచారు. గురువారం రాత్రి కమిషనరేట్ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 148 మంది పట్టుబడ్డారు. వారిపై డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ట్రాఫిక్ విభాగం పరిధిలో అత్యధికంగా 55 కేసులు నమోదు కాగా, సెంట్రల్ జోన్‌లో 62, వెస్ట్ జోన్‌లో 10, ఈస్ట్ జోన్‌లో 21 కేసులు నమోదయ్యాయి.


