News March 19, 2025
NLG: జీపీ కార్మికుల వేతన వెతలు

నల్గొండ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు రాక ఆర్థిక కష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంచాయతీ కార్మికుల పట్టించుకునే నాథులే లేక దుర్భరమైన బతుకులు.. ఇది NLG జిల్లాలో 856 గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికుల దుస్థితి. సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. 3నెలలుగా వేతనాలు పెండింగ్‌లో పెట్టడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు తెలిపారు.
Similar News
News March 19, 2025
NLG: చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకోవాలి

ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు కోసం అర్హత గల చేనేత కార్మికులకు నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖ సహాయ డైరెక్టర్ ఎస్.ద్వారక్ తెలిపారు. చేనేత, డిజైన్ వృత్తిలో పని చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికీ రూ.10 వేల నగదు పురస్కారంతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపిక బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News March 19, 2025
తుపాకి చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం

తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకీ చేతబట్టిన తొలి మహిళ మల్లు స్వరాజ్యం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మం. కొత్తగూడెంలో 1931లో భూస్వాముల కుటుంబంలో పుట్టిన ఆమె నైజాం సర్కార్‌కి వ్యతిరేకంగా పోరాడారు. దొరల దురహంకారంపై తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. సాయుధ పోరాటంలో తన అన్న నర్సింహారెడ్డితో కలిసి పోరాడిన ధీరవనిత మల్లు స్వరాజ్యం. 1978, 1983లో తుంగతుర్తి ఎమ్మెల్యేగా గెలిచారు. నేడు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి.
News March 19, 2025
NLG: మఖానా సాగుపై కసరత్తు

జిల్లాలో మఖానా సాగు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిహార్‌లో మాత్రమే రైతులు చేస్తున్న మఖానా సాగుపై జిల్లా అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఆ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి చొరవతో జిల్లాలోని ఐదు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా వానాకాలం నుంచి మఖానా సాగు చేయించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖల పర్యవేక్షణలో కార్యాచరణ రూపొందించారు.