News March 4, 2025

NLG: టీచర్ MLC ఎన్నికలు.. ‘ఏక్’ నిరంజన్!

image

NLG – KMM – WGL టీచర్ MLC ఎన్నికల ఫలితాల్లో ఓ అభ్యర్థి ఒకటే ఓటు వచ్చింది. ఈ ఎన్నికల్లో మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా అందులో బంకా రాజు-7, కంటె సాయన్న-5, చలిక చంద్రశేకర్-1 సింగిల్ డిజిట్ ఓట్లకే పరిమితమయ్యారు. కాగా.. మరో ఆరుగురు తాటికొండ వెంకటయ్య-39, జంగిటి కైలాసం-26, పన్నాల గోపాల్‌రెడ్డి-24, అర్వ స్వాతి-20, లింగిడివెంకటేశ్వర్లు-15, పురుషోత్తంరెడ్డి-11 డబుల్ డిజిట్ ఓట్లతో సరిపెట్టుకున్నారు.

Similar News

News March 4, 2025

NLG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో ‘సారీ’!

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు. అంతేకాదు గత నాలుగు పర్యాయాలుగా ఒకసారి గెలిచిన అభ్యర్థిని / సంఘాన్ని వరుసగా రెండోసారి ఉపాధ్యాయులు గెలిపించడం లేదు. దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ 2007లో శాసనమండలిని పునరుద్ధరించారు. అప్పుడు మొదటిసారి నిర్వహించిన WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావేత్త చుక్కా రామయ్య యూటీఎఫ్ తరఫున విజయం సాధించారు.

News March 4, 2025

NLG: ఆన్లైన్లో ఇంటర్ హాల్ టికెట్లు

image

ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావొచ్చని జిల్లా ఇంటర్ విద్యా అధికారి దస్రునాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో తీసుకున్న హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకుండానే పరీక్షలు రాయవచ్చని తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ల మంజూరులో జాప్యం చేసినా, కేంద్రాల్లో సమస్యలు ఉన్నా డీఐఈవో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

News March 4, 2025

NLG: హాస్టల్ పిల్లలకు నో చికెన్!

image

బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో సాధ్యమైనంతవరకు విద్యార్థులకు చికెన్ పెట్టవద్దని జిల్లా పరిధిలోని ఆయా హాస్టళ్ల వార్డెన్లకు పరోక్ష ఆదేశాలు జారీ అయినట్లు తెలిసింది. దీంతో కొన్ని హాస్టళ్లలో విద్యార్థులకు చికెన్ పెట్టడం మానేశారు. కొన్ని హాస్టళ్లలో మాత్రం వార్డెన్లు చికెన్ వండి పెడుతున్నారని పలు హాస్టళ్ల సంక్షేమాధికారులు పేర్కొన్నారు. ఈ విషయమై అధికారుల నుంచి తమకు స్పష్టమైన ఆదేశాలు అందలేదని స్పష్టం చేశారు.

error: Content is protected !!