News March 22, 2025
NLG: టెన్త్ పేపర్ లీక్.. ఇన్విజిలేటర్ సస్పెండ్

నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్‌లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష కేంద్ర సూపరింటెండెంట్‌ను డ్యూటీ నుంచి తొలగించి, ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు MEO నాగయ్య తెలిపారు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామన్నారు.
Similar News
News March 24, 2025
నేడు నల్గొండకు మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ జిల్లాకు నేడు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు నల్గొండలోని మంత్రి క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు. 9.30 గంటలకు అర్జలాబావిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 10.30 గంటలకు తిప్పర్తిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.
News March 23, 2025
NLG: వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో యువకుడి మృతి

నేరేడిగొమ్ము వైజాగ్ కాలనీ కృష్ణా తీరంలో బోడుప్పల్‌కు చెందిన యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలిలా.. HYDకు చెందిన కొందరు యువకులు ఆదివారం రాత్రి వైజాగ్ కాలనీకి విహారయాత్రకు వచ్చారు. ఉదయం కృష్ణా తీరంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి యువకుడు మృతి చెందాడు. వైజాగ్ కాలనీ బ్యాక్ వాటర్ వద్ద పర్యవేక్షణ ఉండదని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు.
News March 23, 2025
నల్గొండ జిల్లాలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

నల్గొండ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. MLG, వేములపల్లి, తిప్పర్తి, హాలియా, NDMNR, కనగల్, మునుగోడు, NKL ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని, ఫిర్యాదు చేసిన వారిని బెదిరిస్తూ దాడులకు పాల్పడుతున్నారని అంటున్నారు.