News March 6, 2025

NLG: తెలంగాణ ఐసెట్ 2025 నోటిఫికేషన్ విడుదల

image

NLG MGUలో ఐసెట్ 2025 నోటిఫికేషన్‌ను సెట్ ఛైర్మన్, ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి విడుదల చేశారు. జూన్ 8, 9వ తేదీల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 10 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చును. పూర్తి వివరాలకు https://icet.tsche.ac.inను సందర్శించాలన్నారు.

Similar News

News March 7, 2025

కెరమెరి: గిరిజన సాహస పుత్రిక కన్నిబాయి

image

భీమన్ గొందికి చెందిన మడవి కన్నీబాయి మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. మారుమూల గిరిజన గ్రామంలో పుట్టి సాహస క్రీడల్లో సరికొత్త చరిత్ర లిఖించి ఆదివాసీ ముత్యంగా మెరిసింది. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఇంటర్ వరకు చదివి ఆపేశారు. చిన్నతనం నుంచి క్రీడలపై ఉన్న ఆసక్తితో పారాసైలింగ్, రాపెలింగ్, జూమరింగ్ క్రీడల్లో సత్తా చాటింది. కాగా ఎవరెస్టు శిఖరం అధిరోహించడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె తెలిపారు.

News March 7, 2025

తిరుపతిలో చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలను సహించం: SP

image

తిరుపతి నగరంలో ఎలాంటి సామాజిక వ్యతిరేక కార్యకలాపాలను సహించబోమని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. గురువారం తిరుపతి రైల్వే స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లను ఆయన తనిఖీ చేశారు. కర్నాల వీధి నుంచి పూర్ణకుంభం సర్కిల్ వరకు తూర్పు పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 19 సీసీ కెమెరాలను SP పరిశీలించారు.

News March 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

error: Content is protected !!