News April 7, 2025
NLG: యాక్సిడెంట్‌లో ఎమ్మెల్సీ కోటిరెడ్డి డ్రైవర్ మృతి

నిడమనూరు మండలం గుంటిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కారు డ్రైవర్ నరసింహగా గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Similar News
News April 8, 2025
NLG జిల్లా ప్రజలపై రూ.3 కోట్ల భారం !

మరోసారి వంటగ్యాస్ ధరలు పెరిగాయి. గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు నేటి నుంచి అమలులోకి వస్తాయి. దీంతో ప్రస్తుతం రూ.875గా ఉన్న సిలిండర్ ధర సవరించిన ధర రూ.50లతో కలిపి రూ.925కు చేరింది. ప్రస్తుతం రూ.503గా ఉన్న ఉజ్వల్ సిలిండర్‌కు కూడా పెంపు వర్తిస్తుందని తెలిపారు. దీంతో ఉజ్వల్ సిలిండర్ రూ.553కు చేరుకోనుంది. జిల్లా ప్రజలపై సుమారు 3 కోట్లకు పైగా భారం పడనుంది.
News April 8, 2025
బుద్ధవనాన్ని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు

బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 12న నాగార్జునసాగర్ బుద్ధవనాన్ని మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిస్ వరల్డ్ పోటీ దారుల రాక ఏర్పాట్లపై సోమవారం తన ఛాంబర్‌లో పర్యాటక, రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ప్రపంచ సుందరి పోటీదారులు రానున్నారు.
News April 7, 2025
NLG: కొత్త కార్డుల కోసం ఎదురుచూపులు

రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో రేషన్ తీసుకునే వారి సంఖ్య పెరిగింది. జిల్లాలో ఇంతకు ముందు ఇచ్చే దొడ్డు బియ్యం సగానికి పైగా లబ్ధిదారులు తినకపోవడం.. తీసుకున్న బియ్యం టిఫిన్ల కోసం వినియోగించేవారు. తినడానికి పనికి రాని బియ్యంకోసం ఏం ఆశపడుతామని మౌనంగా ఉన్న కార్డులేని వారు.. సన్న బియ్యం ఇవ్వడంతో తమకు కార్డు ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. నాయకులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.