News April 6, 2025
NLG: రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

సీతారాముడి కళ్యాణోత్సవానికి జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని అన్ని ఆలయాలల్లో నేడు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించి చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ వేడుకల అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం కళ్యాణమూర్తులను ఊరేగించనున్నారు. జిల్లా కేంద్రం రామగిరి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.
Similar News
News April 9, 2025
చిట్యాల: 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నర్రా రాఘవరెడ్డి

చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన కమ్యూనిస్టు యోధుడు నర్రా రాఘవ రెడ్డి 1967, 1978, 1983, 1984, 1989, 1994 సంవత్సరాలలో నకిరేకల్ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కమలమ్మ రామ్ రెడ్డి దంపతులకు జన్మించిన రాఘవరెడ్డి ఎన్నో ఉద్యమాలలో ప్రజా సమస్యలపై కీలకంగా పని చేశారు. ప్రతిపక్ష నేతగా టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుపై తీవ్రంగా విరుచుకు పడేవారు. నేడు రాఘవరెడ్డి వర్ధంతి.
News April 9, 2025
నల్గొండ జిల్లాలో CONGRESS VS BRS

నల్గొండ జిల్లాల్లో BRS, కాంగ్రెస్ మధ్య రాజకీయం నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. ఓ వైపు BRSనేతలు KCR వరంగల్ సభపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు జైబాపు.. జైభీమ్.. జైసంవిధాన్ పేరిట పాదయాత్రలు, ర్యాలీలు, సన్నబియ్యం పంపిణీతో ప్రజల్లో ఉంటూ BRSనేతలకు కౌంటర్ ఇస్తున్నారు. మీ కామెంట్?
News April 9, 2025
NLG: చైల్డ్ పోర్న్ వీడియోలు చూసి, షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

చైల్డ్ పోర్న్ వీడియోలు చూసి ఇతర గ్రూప్‌లకు షేర్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. CI రాజు తెలిపిన వివరాలు.. హుజూర్నగర్ గాంధీ పార్క్ చౌరస్తాకు చెందిన శ్రీనివాసరావు నాలుగేళ్లుగా సెల్ ఫోన్లో చైల్డ్ పోర్న్ వీడియోలు చూస్తున్నాడు. వాటిని డౌన్లోడ్ చేసి ఇతర గ్రూప్‌లకు షేర్ చేయడంతో సైబర్ సెక్యూరిటి అధికారులు గమనించి HNR పీఎస్‌కు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.