News March 19, 2025

NLG: లక్ష ఎకరాలకు సాగునీరు.. 107 గ్రామాలకు తాగునీరు

image

ఉదయ సముద్రం బ్రాహ్మణ వెల్లంల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా 94 గ్రామాల్లో లక్ష ఎకరాలకు సాగు నీరు, ఫ్లోరైడ్ సమస్య ఉన్న 107 గ్రామాలకు తాగునీటిని అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి 6.70 TMCల నీటిని బ్రాహ్మణ వెల్లంల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు లిఫ్ట్ చేస్తామన్నారు. 

Similar News

News November 1, 2025

శిశు విక్రయాలు, లైంగిక దాడులపై కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి

image

నల్గొండ జిల్లాలో ఆడబిడ్డల రక్షణకై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శిశు విక్రయాలు, బాల్య వివాహాలు, హాస్టల్ విద్యార్థినులపై లైంగిక దాడులు వంటి వాటిని అరికట్టడంలో అన్ని సంక్షేమ శాఖలు, ఆర్.సీ.ఓ.లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఈ దుశ్చర్యలకు పాల్పడితే సంబంధిత శాఖల అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News November 1, 2025

చిన్నసూరారం ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

నల్గొండ మండలం చిన్నసూరారం గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా సీరియల్ ప్రకారం కాంటాలు వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ధాన్యం తడవకుండా ఎప్పటికప్పుడు తూకాలు పూర్తి చేయాలని, అందుకు అవసరమైన లారీలు, బస్తాలు, పట్టాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.

News November 1, 2025

NLG: ఆ ధాన్యాన్ని కొనుగోలు చేశాం: కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో నల్గొండ జిల్లాలోని 10 మండలాల పరిధిలో కొంతమేరకు తడిసిన వరి ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలోని వివిధ కొనుగోలు కేంద్రాల్లో సుమారు 4,600 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.