News April 17, 2025
NLG: వానాకాలం సాగు అంచనా 11.60 లక్షల ఎకరాలు!

వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ ఖరారు చేసింది. దీనికి అవసరమైన ఎరువులు, విత్తనాల ప్రతిపాదనలు కూడా ఖరారు చేసిన వ్యవసాయ శాఖ.. కమిషనరేట్‌కు పంపించింది. గత వానాకాలంలో 11,50,556 ఎకరాల్లో వరి, పత్తి, ఇతర పంటల సాగు కాగా ప్రస్తుత వానాకాలంలో అదనంగా సుమారు 10 వేల ఎకరాలు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ప్రస్తుత వానాకాలంలో 11,60,389 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు ప్రణాళిక ఖరారు చేసింది.
Similar News
News April 20, 2025
రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల పరిశీలన

జిల్లాలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుంది. ఈ పథకానికి జిల్లా వ్యాప్తంగా 79,052 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఈ దరఖాస్తులను మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు 21,120, ఎస్టీ కార్పొరేషన్‌కు 11,515, బీసీ కార్పొరేషన్‌కు 39,274, ఈ బీసీ 1,994, మైనార్టీకి 4,926, క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్‌కు 253 దరఖాస్తులు వచ్చాయి.
News April 20, 2025
ఒకే కాన్పులో ముగ్గురు జననం

సూర్యాపేట మండల పరిధిలోని రాయినిగూడెంకి చెందిన షేక్ షబానాకు మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. సూర్యాపేటలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సంతానం కోసం చికిత్స పొంది గర్భం దాల్చారు. ఆమెకు బీపీ, షుగర్, థైరాయిడ్ ఉండటంతో ఆసుపత్రి యజమాన్యం హైరిస్క్ ప్రెగ్నెన్సీగా అడ్మిట్ చేసుకొని సిజేరియన్ చేశారు. ఒకే కాన్పులో ఇద్దరు మగ శిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారు.
News April 20, 2025
NLG: ప్రతి మూడో ఆదివారం.. బుద్ధవనం టూర్!

టూరిజం శాఖ సహకారంతో ప్రతిమ ట్రావెల్స్ ఆధ్వర్యంలో HYD నుంచి నాగార్జునసాగర్‌కు ప్రతి నెలా మూడో ఆదివారం ప్రత్యేకంగా పర్యాటకులకు నాగార్జునసాగర్ టూర్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు బుద్ధవనం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు HYD నుంచి బయల్దేరి నాగార్జునసాగర్ చేరుకొని బుద్ధవనం, నాగార్జునకొండలను సందర్శించిన అనంతరం రాత్రి 9 గంటల వరకు HYDకు పర్యాటకులను చేర్చుతారని తెలిపారు