News April 8, 2025

NLG: వైద్య ఆరోగ్యశాఖలో అద్దె వాహనాలకు ఆహ్వానం

image

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యం లో జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్‌కు జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, యూపీహెచ్సీల నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించేందుకు ట్యాక్స్ ప్లేట్ కలిగిన అద్దె వాహనాలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ తెలిపారు. పూర్తి వివరాలకు https://nalgonda.telangana. gov.in వెబ్సైట్స్ ను పరిశీలించాలని సూచించారు.

Similar News

News April 19, 2025

కేతేపల్లి: తండ్రి మందలించడంతో యువకుడి సూసైడ్

image

తండ్రి మందలించడంతో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. కేతేపల్లి మండలం వెంకన్నపల్లికి చెందిన కొండయ్య(32) డ్రైవర్‌గా పనిచేసేవాడు. బైక్‌ విషయంలో తండ్రి, కొడుకు మధ్య గొడవ జరగగా తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై ఈనెల 16న పురుగు మందు తాగాడు. సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 19, 2025

నల్గొండ: రూ.300 కోట్లు మోసం చేశారని ఆందోళన

image

విప్స్ కంపెనీ డైరెక్టర్లమని తమను నమ్మించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విప్స్ కంపెనీ బాధితులు కోరారు. ఈ మేరకు శుక్రవారం నల్గొండ డీఎస్పీ కార్యాలయం వద్ద నిరసన తెలిపి, డీఎస్పీకి వినతిపత్రం అందజేశారు. అనంతరం బాధితులు మాట్లాడుతూ.. కంపెనీలో డైరెక్టర్లమని ప్రజలను మభ్యపెట్టి జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల పెట్టుబడులు పెట్టించి మోసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

News April 19, 2025

నల్గొండ: రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు: DRO

image

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని నల్గొండ ఇన్‌ఛార్జ్ డీఆర్ఓ వై.అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం నల్గొండ మండల కేంద్రంలోని కంచనపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంటనే కాంటా వేయాలన్నారు. మిల్లులకు పంపించే ధాన్యం వివరాలను కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జ్ బట్టు నవీన్‌ను అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!