News January 3, 2025

NLG: సంక్రాంతికి ఆర్టీసీ 400 ప్రత్యేక బస్సులు

image

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇందుకోసం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 400 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఎక్కువ సంఖ్యలో సొంత ఊళ్లకు చేరుకునేందుకు అవకాశముందని భావించిన ఆర్టీసీ అధికారులు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేస్తున్నారు.

Similar News

News January 7, 2025

NLG: ఓటర్ల లెక్క తేలింది.. ‘ఆమె’దే ఆదిపత్యం!

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది. ఓటర్ తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 29,75,286 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులకన్న మహిళా ఓటర్లు 48,797 మంది అధికంగా ఉన్నారు. పురుష ఓటర్లు 14,63,142 మంది ఉండగా, మహిళా ఓటర్లు 15,11,939, ట్రాన్స్ జెండర్లు 2005 మంది ఉన్నారు. 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటర్ జాబితాతో పోల్చితే ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది.

News January 6, 2025

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని NLG జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖతో పాటు, అన్ని శాఖల అధికారులు ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.

News January 6, 2025

NLG: MGU LAW ఫలితాలు విడుదల

image

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం లా ఐదు సంవత్సరాల పదవ సెమిస్టర్ (రెగ్యులర్‌) & 5, 6, 7, 8, 9 సెమిస్టర్ల (బ్యాక్లాగ్) ఫలితాలను విడుదల చేసినట్లు సీఓఈ డా.ఉపేందర్ రెడ్డి తెలిపారు. అలాగే మూడు సంవత్సరాల లా డిగ్రీ ఆరవ సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. వివరాలకు https://mguniversity.in/వెబ్సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.