News April 29, 2024

NLGa: మద్యం.. మనీ ప్రభావంపై నిఘా

image

పార్లమెంట్ ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రలోభాలకు తావులేకుండా సజావుగా ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టింది. బెల్టు షాపులన్నింటినీ మూసివేయడంతోపాటు నిరంతర నిఘా ఏర్పాటుచేసి మద్యం ప్రవాహం ఓటర్లపై ఉండకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటి వరకు 140 కేసులను నమోదు చేయడంతోపాటు రూ.26.25 లక్షల విలువ కలిగిన 44వేల లీటర్ల మద్యం సీజ్ చేశారు.

Similar News

News November 10, 2024

NLG: విహారయాత్రలో విషాదం.. యువకుడు మృతి

image

నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం వైజాగ్ కాలనీ విహార యాత్రలో విషాదం నెలకొంది. ఆదివారం నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి అనిల్ అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. కాగా అనిల్ స్నేహితులతో కలిసి సికింద్రాబాద్ నుంచి వైజాగ్ కాలనీకి విహారయాత్ర కోసం వచ్చినట్టు పోలీసులు తెలిపారు.

News November 10, 2024

సూర్యాపేట: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

సూర్యాపేట జిల్లా మఠంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. మృతుల రఘునాథ్ పాలెం, పెదవిడు గ్రామాలకు చెందినవారుగా గుర్తించారు. ఘటన స్థలానికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 10, 2024

18 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలి: డీఈఓ భిక్షపతి

image

2025 సంవత్సరం మార్చి నెలలో జరిగే 10వ తరగతి వార్షిక పరీక్షల ఫీజును ఈనెల 18లోగా చెల్లించాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. రూ. 50 అపరాధ రుసుముతో డిసెంబర్ 2, రూ.200 అపరాధ రుసుముతో డిసెంబర్ 12, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబర్ 21 వరకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.