News December 10, 2024
NLR: అద్దె వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అద్దె వాహనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు DMHO కె.పెంచలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దాసుపత్రి ఆవరణలోని బాల భవిత కేంద్రం నుంచి రోగులను రవాణా చేసేందుకు వాహనాలు అవసరమని చెప్పారు. వాహనంలో 10 నుంచి 16 సీట్లు ఉండాలని సూచించారు. ప్రతి నెలా రూ.60 వేలు అద్దె ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు బాల భవిత కేంద్రం మేనేజర్ను సంప్రదించాలని సూచించారు.
Similar News
News September 18, 2025
వేగూరులో పిడుగుపాటుకు వ్యక్తి మృతి

కోవూరు మండలం వేగూరు పంచాయతీలో పిడుగుపాటుకు గోళ్ల వెంకయ్య మృతి చెందారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షం కురిసింది. సమాచారం అందుకున్న రెవెన్యూ, పోలీస్ అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కోవూరు ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ మృతదేహాన్ని పరిశీలించారు.
News September 18, 2025
వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

ఆటో, మాక్సీ క్యాబ్ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కార్డ్, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్ నెస్ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.
News September 18, 2025
నెల్లూరు: చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు..!

నెల్లూరు జిల్లాలో కొందరు నిషేధిత క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. వీటికి కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతూ ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 21,629 చెరువుల్లో అనుమతులతో చేపలు పెంచుతున్నారు. మరో 5వేల ఎకరాల్లో అక్రమంగా ఆక్వా సాగు ఉన్నట్లు అంచనా. అల్లూరు, బుచ్చి, సంగం, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్ పరిధిలో వ్యర్థాల వాడకం ఎక్కువగా ఉంటోంది.