News April 12, 2025
NLR: అమ్మోనియం లీక్.. 10మందికి అస్వస్థత

నెల్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News April 15, 2025
నెల్లూరు చిన్నారుల గిన్నిస్ రికార్డ్

నెల్లూరుకు చెందిన రియో(9), జియాన్ (6) గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. హైదరాబాద్‌లోని హల్లెల్ మ్యూజిక్ స్కూల్ ఆధ్వర్యంలో 2024 డిసెంబర్ 1న జరిగిన మ్యూజిక్ విభాగం కీబోర్డ్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ మూడు స్వరాలను 45 సెకండ్లలో పాడి రికార్డు సృష్టించారు. సోమవారం హైదరాబాద్‌లో ఆ చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్లను ఆ సంస్థ ప్రతినిధులు అందజేశారు.
News April 14, 2025
అంబేడ్కర్ చిరస్మరణీయులు: సోమిరెడ్డి

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిరస్మరణీయులని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సెంటరులోని ఎస్సీ బాలికల వసతిగృహంలో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్‌తో కలసి పాల్గొన్నారు. మొదట వసతి గృహ ప్రాంగణాన్ని పరిశీలించిన వారు సౌకర్యాలపై ఆరా తీశారు. అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
News April 14, 2025
రాపూరు హైవేపై ఘోరం.. ఇద్దరి మృతి

కారు ఇద్దరు రైతులను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృత్యువాత పడ్డ ఘటన రాపూరులోని తిక్కనవాటిక పార్కు వద్ద సోమవారం చోటుచేసుకొంది. పార్కు వద్ద ప్రధాన రహదారిపై ఇద్దరు రైతులు వడ్లు ఎండబెట్టుకుంటున్నారు. ఆ సమయంలో ఓ కారు రాజంపేట వైపు నుంచి వేగంగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాపూరుకు చెందిన గంధం సరస్వతమ్మ(46), గార్లపాటి సురేశ్(26) అక్కడికక్కడే మృతి చెందారు.