News April 12, 2025
NLR: అమ్మోనియం లీక్.. 10మందికి అస్వస్థత

నెల్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
Similar News
News April 20, 2025
రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్: మంత్రి నారాయణ

నెల్లూరు నగరంలో ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందిస్తామని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. శనివారం సాయంత్రం నెల్లూరు నగరంలో 48వ డివిజన్‌లో సురక్షిత తాగునీటి పథకంలో భాగంగా డిస్పెన్సింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. పేద ప్రజల కోసం 2018లోని ఎన్టీఆర్ సుజల స్రవంతికి శ్రీకారం చుట్టామన్నారు.
News April 19, 2025
SP కార్యాలయంలో ఈ-వ్యర్థాల ప్రదర్శన

నెల్లూరులోని ఎస్పీ కార్యాలయంలో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో ఈ-వేస్ట్ సేకరించి ప్రదర్శనకు ఉంచారు. పోలీస్ కార్యాలయంలో 57 మానిటర్లు, 69 హార్డ్ డిస్క్‌లు, సీపీయూలు, 26 కీ బోర్డులు, ప్రింటర్లు. 9 స్టెబిలైజర్లు, 25 కాట్రెడ్జిలు ఈ-వేస్ట్‌గా గుర్తించి వాటిని ప్రదర్శనకు ఉంచారు. అనంతరం కార్యాలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచారు.
News April 18, 2025
నెల్లూరు కార్పొరేషన్ ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నందన్

నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ బదిలీ అయిన విషయం తెలిసిందే. నూతన కమిషనర్‌గా ఇంకా ఎవరిని నియమించలేదు. ఈ నేపథ్యంలో నెల్లూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్ నందన్‌ను ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.