News March 23, 2024
NLR: ఒకే చోట 9వ సారి MLAగా పోటీ

కోవూరులో వరుస విజయాలతో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 1993లో తొలిసారిగా ఆయన ఎన్నికల బరిలో దిగారు. తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికతో రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1994, 99 ఎన్నికల్లోనూ విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. ఆరంభం నుంచి ఒకే నియోజకవర్గంలో కొనసాగుతూ 9వ సారి పోటీ చేయబోతున్నారు.
Similar News
News November 23, 2025
కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
News November 23, 2025
నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.
News November 23, 2025
కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

కావలి జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్పీ పోలీసులను సంప్రదించగలరు.


