News April 19, 2024
NLR: కాంగ్రెస్ MP అభ్యర్థిగా నామినేషన్

కాంగ్రెస్ పార్టీ నెల్లూరు MP అభ్యర్థిగా ఏఐసీసీ నేత కొప్పుల రాజు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేశారు. నెల్లూరు జిల్లా రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్‌కు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. గతంలో నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా కొప్పుల రాజు పనిచేసిన విషయం తెలిసిందే. అనేక ఉద్యమాలకు ఆయన అండగా నిలిచారు.
Similar News
News November 19, 2025
నేడు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
News November 18, 2025
నెల్లూరు: సంగం వద్ద RTC బస్సుకు తప్పిన ప్రమాదం

నెల్లూరు జిల్లా సంగం వద్ద RTC బస్సుకు మంగళవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. షాట్ సర్క్యూట్‌తో బస్సుకింద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ మంటలు గమనించి బైక్‌తో బస్సును చేజ్ చేసి ఆపాడు. అనంతరం బస్సులోని వారందరినీ డ్రైవర్ కిందికి దింపడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో 45మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!