News May 10, 2024

NLR: చివరి ప్రయత్నాల్లో నాయకుల బిజీ..?

image

నెల్లూరు జిల్లాలో ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈనేపథ్యంలో వివిధ పార్టీల నాయకులు ఓటర్లను ఆకట్టుకోవడానికి చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నాయకులు ఓటర్ల ఇళ్లకు వెళ్లి పోలింగ్ స్లిప్పులు పంపిణీ చేశారు. రాత్రికి వచ్చి నగదు ఇస్తామని చెబుతున్నారట. మరికొన్ని చోట్ల ఓటర్ల జాబితా ఆధారంగా ఇప్పటికే తాయిళాల పంపిణీ పూర్తి చేసినట్లు సమాచారం. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.

Similar News

News December 2, 2025

నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

image

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్‌తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్‌లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

News December 2, 2025

నేడు నెల్లూరు జిల్లా బంద్

image

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్‌కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

News December 2, 2025

నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

image

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.