News December 23, 2024
NLR: పాపం.. బిర్యానీలో విషం పెట్టి చంపేశారు..!
అందరూ అయ్యో పాపం అనేలా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. సూళ్లూరుపేట గాండ్ల వీధి షార్ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. ఎవరో కావాలనే బిర్యానీలో విషం పెట్టి కుక్కలను చంపేశారని స్థానికులు చెబుతున్నారు. వాటితో ఇబ్బంది ఉంటే పట్టుకెళ్లి దూరంగా వదిలేయాలి కానీ.. ఇలా విషం పెట్టి చంపడం ఘోరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 24, 2024
క్రైస్తవ మతం 2వేల సంవత్సరాలకు పైగా ఉంది :కలెక్టర్
మానవ జీవితంలో ప్రతిఒక్కరూ ఐక్యత, ప్రేమ, దయతో నిజాయితీగా జీవించడమే క్రీస్తు బోధనల సారాంశమని జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో క్రైస్తవ మతం సుమారు 2వేల సంవత్సరాలకు పైగా ఉందని కలెక్టర్ తెలిపారు.
News December 23, 2024
నెల్లూరు: మందల వెంకట శేషయ్య అరెస్ట్!
మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య అరెస్ట్ అయ్యారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటశేషయ్యను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉంచినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి శేషయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో కాకాణి చేరుకోనున్నారు.
News December 23, 2024
వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో పూర్తి వసతులు: నారాయణ
వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సోమవారం మౌలిక వసతుల్లో కల్పనపై అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీలు గల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం సంస్కరణలు తీసుకొస్తామన్నారు.