News November 8, 2024
NLR: రేపటి నుంచి ప్రత్యేక ఎన్నికల ప్రచారం

నెల్లూరు జిల్లాలో ఈనెల 9,10వ తేదీల్లో ప్రత్యేక ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఓ.ఆనంద్ ఓ ప్రకటనలో తెలిపారు. నెల్లూరు జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు పాల్గొని ఫారం 7,8,9 అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు దరఖాస్తుల స్వీకరించాలన్నారు.
Similar News
News December 15, 2025
ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలు పరిష్కరించండి: సుభాష్

రాష్ట్రంలోని బీసీ ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్న తీవ్ర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దులూరు సుభాష్ యాదవ్ కోరారు. ఈమేరకు విజయవాడలో బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖర్ రాజుకి వినతిపత్రం సమర్పించారు. భవనాల దుస్థితి, నాసిరక ఆహారం, వార్డెన్ల కొరత, స్కాలర్షిప్ల ఆలస్యం, గర్ల్స్ హాస్టళ్లలో భద్రతా లోపం వంటి అనేక సమస్యలు ఉన్నాయని, తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
News December 15, 2025
కాకాణి రిట్ పిటిషన్పై హైకోర్టు స్పందన

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో తనపై నమోదు చేసిన కేసులపై సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖాలు చేశారు. గతంలో దీనిపై సీబీఐ విచారణ చేయించాలని సీఎంకు లేఖ రాసినా స్పందించలేదన్నారు. దీనిపై నోటీసులు జారీ చేసి.. ప్రతివాదుల స్పందన అనంతరం విచారణ చేపట్టి తగు నిర్ణయం తీసుకొనేందుకు హైకోర్ట్ 8 వారాలు వాయిదా వేసినట్లు కాకాణి ఒక ప్రకటనలో తెలిపారు.
News December 15, 2025
ఆస్తి కోసం వేధింపులు.. కొడుకుపై ఎస్పీకి వృద్ధురాలి ఫిర్యాదు

ఇందుకూరుపేటకు చెందిన ఓ వృద్ధురాలు సోమవారం ఎస్పీని కలిసి తన కుమారుడిపై ఫిర్యాదు చేశారు. తన ఇద్దరు కుమారులకు ఆస్తిని సమానంగా పంచి, తాను వేరుగా ఓ ఇంట్లో భర్తతో ఉంటున్నట్లు తెలిపింది. అయితే ఆ ఇంటిని కూడా ఇవ్వాలంటూ తన కొడుకు వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనను, తన భర్తను బెదిరిస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తమకు న్యాయం చేయాలని ఆ వృద్ధురాలు ఎస్పీని కోరారు.


