News April 24, 2024
NLR: రేపు విజయసాయిరెడ్డి నామినేషన్

వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ సమర్పించనున్నారు. ఈ మేరకు ఆయన కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి అందరూ పెద్ద సంఖ్యలో తరలివచ్చి మద్దతు తెలపాలని కోరారు.
Similar News
News December 23, 2025
TPT: అన్యమతస్థులతో గోవిందరాజస్వామి ఆలయ పనులు..?

గోవిందరాజస్వామి ఆలయం విమాన గోపురం బంగారు తాపడం పనులు కాంట్రాక్టర్ జ్యోత్ టెండర్ ద్వారా దక్కించుకుని మరో ఇద్దరు అన్యమతస్థులకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చిందని ప్రచారం జరిగింది. అయితే వారికి ఎలాంటి రాతపూర్వకంగా ఇవ్వలేదని విజిలెన్స్ అధికారులు తేల్చారు. కాగా పనుల్లో అవకతవకలు, విగ్రహాలు తొలగించడంపై హిందూ సంఘాలు ఆరోపణల చేశాయి. తాజాగా ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
News December 23, 2025
నెల్లూరు: అమ్మ చనిపోయింది.. నాన్న వదిలేశాడు.. ‘పాపం పసివారు’

తల్లికి వందనం ఇప్పించాలంటూ కలెక్టర్ హిమాన్షు శుక్లాకు పొదలకూరు (M) నల్లపాలనేకి చెందిన కీర్తన, మేరీ బ్లెస్సీ గ్రీవెన్స్‌లో తమ గోడు విన్నవించుకున్నారు. తమకు తల్లిదండ్రులు లేరని తల్లి మూడేళ్ల కిందట చనిపోయిందని, ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తండ్రి వదిలేసి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కలెక్టర్ సమస్యను సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News December 23, 2025
వెంకటాచలం CHCకి జాతీయ స్థాయి గుర్తింపు

వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా రెండు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు జాతీయ స్థాయి క్వాలిటీ సర్టిఫికేషన్ (National Quality Assurance Standards-NQAS) లభించింది. వాటిలో వెంకటాచలం CHC ఒకటి. ఈ కేంద్రం 84.29 శాతం స్కోరు సాధించింది. దీంతో ఈ కేంద్రానికి రూ.3 లక్షల సర్టిఫికేషన్ ఇన్సెంటివ్, ఏటా రూ.1 లక్ష మెయింటినెన్స్ ఇన్సెంటివ్ అందనుంది.


