News October 18, 2024
NLR: రైతులకు అందుబాటులో ఎరువులు

నెల్లూరు జిల్లాలో రబీ సీజన్ వరి సాగు సౌకర్యార్థం విత్తనాలు, ఎరువులు రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ అధికారిణి P.సత్యవాణి ఓ ప్రకటనలో తెలిపారు. BPT-5204, KNM-1638, NLR-34449 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. DAP, MOP, కాంప్లెక్స్ ఎరువులను రైతు సేవా కేంద్రంలో ఉంటాయని.. అవసరమైన వాళ్లు తీసుకోవాలని సూచించారు.
Similar News
News November 25, 2025
కోటంరెడ్డి సోదరుడి కుమార్తె సంగీత్‌లో భారత క్రికెటర్

టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె హరిణ్యా రెడ్డికి గాయకుడు రాహుల్ సిప్లిగంజ్‌తో మరో రెండు రోజుల్లో వివాహం జరగనుంది. తాజాగా జరిగిన సంగీత్ వేడుకకు రాహుల్ సిప్లిగంజ్ టీం ఇండియా స్పిన్నర్ చాహల్‌ను ఆహ్వానించారు. దీంతో ‘‘నేను చాహల్‌కి వీరాభిమానిని. ఆయన మన సంగీత్‌కు వచ్చారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నా’’ అంటూ హరిణ్య పోస్టు చేశారు.
News November 25, 2025
ఉదయగిరి: ఇల్లు కట్టుకునేవారికి రూ.2.50 లక్షలు

సీఎం చంద్రబాబు సొంత ఇల్లులేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు (గణ) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మండలంలోని ప్రతి పేద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. వివరాలకు సచివాలయంలో సంప్రదించాలన్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.


