News December 10, 2024

NLR: అద్దె వాహనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా అద్దె వాహనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు DMHO కె.పెంచలయ్య ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దాసుపత్రి ఆవరణలోని బాల భవిత కేంద్రం నుంచి రోగులను రవాణా చేసేందుకు వాహనాలు అవసరమని చెప్పారు. వాహనంలో 10 నుంచి 16 సీట్లు ఉండాలని సూచించారు. ప్రతి నెలా రూ.60 వేలు అద్దె ఇస్తామన్నారు. ఆసక్తి ఉన్నవారు బాల భవిత కేంద్రం మేనేజర్‌ను సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 5, 2025

యూట్యూబర్‌పై క్రిమినల్ కేసు నమోదు

image

AP 175 న్యూస్ యూట్యూబర్ M.శ్రీనివాసరావుపై కందుకూరులో క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు CI అన్వర్ బాషా తెలిపారు. AP175 న్యూస్, గుండుసూది పేర్లతో శ్రీనివాసరావు సంచలనాత్మక కథనాలను యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తుంటారు. కందుకూరు MLA ఇంటూరిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఆయన ఇటీవల వీడియోలు పోస్ట్ చేశారు. కొందరితో కుట్ర చేసి MLA పరువుకు భంగం కలిగేలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా పోస్ట్ చేస్తున్నారని కేసు నమోదైంది.

News November 5, 2025

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

image

నెల్లూరు దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అమ్మవారికి శ్రీ కాత్యాయని వ్రత మహోత్సవం వైభవంగా జరిగింది. అలాగే బుధవారం ఉదయం 10 గంటలకు ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి చెప్పారు. సాయంత్రం ఆలయ శిఖరంపై అఖండ కార్తీక దీపం వెలిగిస్తున్నామని చెప్పారు.

News November 4, 2025

తిరుపతిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

image

తిరుపతి రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం నెల్లూరు స్టోన్ హౌస్ పేటకు చెందిన విద్యార్థి సాయి చందు(20) హాస్టల్ టెర్రస్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫీజు కోసం తండ్రికి ఫోన్ చేసిన కొన్ని గంటల్లోనే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారం మృతికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.