News May 9, 2024
NLR: ఐటీఐల్లో ప్రవేశానికి దరఖాస్తులు

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల్లో అందుబాటులో ఉన్న వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఈనెల 9 నుంచి జూన్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ప్రక్రియతో పాటు ఏ సందేహం ఉన్నా వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ ఐటీఐలో సంప్రదించాలని కోరారు.
Similar News
News October 23, 2025
రేపటి నుంచి తెరుచుకోనున్న స్కూళ్లు, కాలేజీలు

నెల్లూరు జిల్లాలో శుక్రవారం పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీలు తెరుచుకుంటాయని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులుగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు.
News October 23, 2025
నెల్లూరు: ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పల్లిపాడులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థలో ఖాళీల భర్తీకి DEO డా.ఆర్ బాలాజీ రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లాలో 5 సం.లు అనుభవం కలిగిన స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సీనియర్, జూనియర్ లెక్చర్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్, తెలుగు, ఫిజిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఇంగ్లిష్, సీనియర్, జూనియర్ లెక్చరర్ ఇన్ ఈవీఎస్, సోషల్ పోస్టులకు గాను గూగుల్ ఫామ్ ద్వారా ఈనెల 29వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
News October 23, 2025
Way2News వార్తకు స్పందించిన రూరల్ ఎమ్మెల్యే

Way2News వార్తకు నెల్లూరు ఎమ్మెల్యే స్పందించారు. బుధవారం <<18069637>>కోటంరెడ్డి సార్.. పొట్టేపాలెం కాలువ తీయండి..!<<>> అనే వార్త Way2Newsలో కథనం ప్రచురితమైంది. దీంతో ఎమ్మెల్యే స్పందించి చర్యలు చేపట్టారు. గురువారం నెల్లూరు నుంచి పొట్టేపాళెంకు వెళ్లే ప్రధాన రహదారిని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. వర్షపు నీరు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.