News July 1, 2024

NLR: ఒకే కుటుంబంలో రూ.22 వేలు పింఛన్

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ జోరుగా జరుగుతోంది. మధ్యాహ్నం 1.30 గంటల వరకు జిల్లాలో 64.32 శాతం మందికి పింఛన్ అందజేశారు. ఈక్రమంలో వరికుంటపాడు మండలంలోని ఆండ్రావారిపల్లె గ్రామంలో ఒకే కుటుంబంలో రూ.22 వేలు పింఛన్ అందజేసినట్లు ఎంపీడీవో తోట వెంకటకృష్ణ కుమారి తెలిపారు. పరంధామలు రెడ్డికి వృద్ధాప్య పెన్షన్ రూ.7 వేలు అందజేశామని చెప్పారు. ఆయన భార్య పక్షవాత రోగి కావడంతో మరో రూ.15 వేలు ఇచ్చారు.

Similar News

News January 19, 2025

సూళ్లూరుపేట: పర్యాటకులకు ఉచిత బస్సు సౌకర్యం

image

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వచ్చే పర్యాటకుల కోసం సూళ్లూరుపేట నుంచి ఆది, సోమవారాల్లో (19,20 తేదీలు) అటకానితిప్ప, నేలపట్టు, బీవీ పాలెం పర్యాటక ప్రాంతాలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్ తెలిపారు. ఇందుకోసం 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పర్యాటకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

News January 18, 2025

నెల్లూరు నగరంలో భారీ ర్యాలీ

image

ప్రజలందరి భాగస్వామ్యంతో స్వచ్ఛ ఆంధ్ర సాకారం అవుతుందని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నెల్లూరు నగరంలో వీఆర్సీ నుంచి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించారు, గాంధీ బొమ్మకు పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో 722 గ్రామ పంచాయతీలతో పాటు, మున్సిపాలిటీలలో కూడా స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.

News January 18, 2025

నెల్లూరుకు నీరు రావడం NTR పుణ్యమే: సోమిరెడ్డి

image

తెలుగుగంగ ప్రాజెక్టును రూపొందించి నెల్లూరు నేలను కృష్ణా జలాలతో తడిపిన ఘనత నందమూరి తారక రామారావుదేనని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలోనే ఏ జిల్లాకు లేని విధంగా నెల్లూరుకు 146 టీఎంసీల సామర్థ్యం కలిగిన సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటం ఎన్టీఆర్ పుణ్యమేనన్నారు. ఈ మేరకు ఆయన ఎన్టీఆర్‌తో అప్పట్లో దిగిన ఫొటోను ట్వీట్ చేశారు.