News June 25, 2024

NLR: క్వార్ట్జ్ అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు

image

నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ అక్రమాల్లో సజ్జల రామకృష్ణ, ఆయన అనుచరుల పాత్ర తేల్చాలని సైదాపురం గనుల యజమాని బద్రీనాథ్ సీఐడీ DSPకి ఫిర్యాదు చేశారు. ‘సజ్జల కనుసన్నల్లోనే గనుల దోపిడీ జరిగింది. జోగుపల్లిలోని 240 ఎకరాల్లో మాకు 8గనులు ఉన్నాయి. రెండేళ్లుగా అక్రమంగా గనులు తవ్వి రూ.వేల కోట్ల విలువైన క్వార్ట్జ్ దోచేశారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారు’ అని ఆయన ఆరోపించారు.

Similar News

News June 29, 2024

బాలికతో నెల్లూరు యువకుడి అసభ్యకర చాటింగ్

image

నెల్లూరు జిల్లాకు చెందిన ఓ యువకుడిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడికి రాంగ్ కాల్ ద్వారా ఆ రాష్ట్రంలోని తాండూరుకు చెందిన బాలికతో అతను కనెక్ట్ అయ్యాడు. అలాగే అసభ్యకరంగా చాటింగ్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో అక్కడి ఎస్ఐ విఠల్ రెడ్డి రంగంలోకి దిగి… యువకుడిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేశారు.

News June 29, 2024

నెల్లూరు: వీవీ ప్యాట్లలో పేపర్ రోల్స్ తొలగింపు

image

నెల్లూరులోని ఈవీఎంల గోదాములను కలెక్టర్ ఎం.హరి నారాయణన్ పరిశీలించారు. ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎంల గోడౌన్‌ను రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. ఇటీవల ఎన్నికలకు ఉపయోగించిన వీవీ ప్యాట్ మెషిన్లలో మిగిలిన పేపర్ రోల్స్ తొలగించారు. అనంతరం వీవీ ప్యాట్లను యథావిధిగా భద్రపరిచే ప్రక్రియను రెవిన్యూ అధికారులు చేపట్టారు.

News June 28, 2024

పిన్నెల్లిని కలిసిన మాజీ మంత్రి కాకాణి

image

మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలిశారు. పిన్నెల్లిపై అనేక కేసులు బనాయించి జైలులో పెట్టడం హేయమైన చర్యని కాకాణి అన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా, అండగా నిలిచి సంఘటితంగా పోరాడుతామని ఆయన చెప్పారు.