News August 1, 2024

NLR: జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ల బదిలీ

image

నెల్లూరు జిల్లాలోని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పలువురు సబ్ రిజిస్ట్రార్లను బదిలీ చేస్తూ ఆశాఖ డీఐజీ కిరణ్ కుమార్ ఉత్త ర్వులు జారీ చేశారు. కోవూరు, ఆత్మకూరు, వెంకటగిరి స్థానాల్లో డిప్యుటేషన్‌పై గత కొంత కాలంగా పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లను రెగ్యులర్ స్థానాలకు బదిలీ చేశారు. బదిలీ చేసిన సబ్ రిజిస్టర్లు వారి కేటాయించిన స్థానాల్లో విధులు నిర్వహించాలని సూచించారు.

Similar News

News April 14, 2026

నెల్లూరు: బాధితురాలికి ప్రభుత్వ ఉద్యోగం.!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

News April 14, 2026

అట్రాసిటీ బాధితురాలికి సర్కారు కొలువు!

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితురాలు టీ. దుర్గకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉద్యోగం కల్పించిందని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమెకు పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ శాఖలో ఆఫీస్ సబార్డినేట్‌గా నియామక ఉత్తర్వులు అందజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటూ, జీవనోపాధి కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేశారు.

News April 13, 2026

కొడవలూరు: రైలు కిందపడి మహిళ మృతి

image

పడుగుపాడు- కొడవలూరు రైల్వే స్టేషన్ మధ్య సుమారు 40-45 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తు తెలియని మహిళ రైలు కింద పడి మరణించింది. మహిళ పచ్చని చీరపై వంగపూత రంగు చుక్కలు, అంచు కలదు. ఎర్రని జాకెట్, నల్లని లంగా ధరించి ఉంది. మేడలో పూసలతో కూడిన పసుపు దారం, కుడి చేతిపై •> గుర్తు గల పచ్చ బొట్టు ఉంది. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.