News April 8, 2025

NLR: పోలీసులపై పర్వత రెడ్డి విమర్శలు

image

నెల్లూరు జిల్లా పోలీసులు అనాలోచితంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏదో రకంగా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉందన్నారు. నాయకులకే రక్షణ లేకపోతే ప్రజల సంగతి ఏంటని ప్రశ్నించారు.

Similar News

News April 17, 2025

నెల్లూరులో వ్యభిచారం గుట్టురట్టు

image

నెల్లూరులోని వ్యభిచార కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. బాపట్ల జిల్లాకు చెందిన మహిళ నెల్లూరు హరనాథపురం శివారులోని ఓ అపార్ట్‌మెంట్లో ఇంటిని రెంట్‌కు తీసుకుంది. వివిధ ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. పక్కా సమాచారంతో బాలాజీ నగర్ సీఐ సాంబశివరావు దాడి చేశారు. ఆమెతో పాటు విటుడు మహేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు.

News April 17, 2025

అలా చేస్తే రూ.10 లక్షల ఫైన్: నెల్లూరు జేసీ

image

కాల్షియం కార్బైడ్ ఉపయోగించి కృత్రిమ పద్ధతిలో పండ్లను మగ్గపెట్టే పండ్ల వ్యాపారులకు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తీక్ హెచ్చరించారు. ఏడు శాఖల అధికారులతో జూమ్ మీటింగ్ ద్వారా ఆయన సమీక్ష నిర్వహించారు. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమవుతోందని, అధికారులు తనిఖీలు వేగవంతం చేయాలన్నారు. ఎక్కడైనా కాల్షియం కార్బైడ్ వినియోగిస్తే చర్యలు తీసుకోవాలని సూచించారు.

News April 17, 2025

నెల్లూరులో నేడే జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం 

image

జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం గురువారం 11 గంటలకు నెల్లూరు కలెక్టర్ ఓ.ఆనంద్ అధ్యక్షతన జరగనున్నట్లు జల వనరుల శాఖ ఇంజినీర్ డాక్టర్ దేశి నాయక్ తెలిపారు. బోర్డు సభ్యులు, సంబంధిత అధికారులు ఈ సమావేశానికి తప్పకుండా హాజరుకావాని కోరారు. నెల్లూరులోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ మీటింగ్ జరగనున్నట్లు ఆయన వెల్లడించారు. 

error: Content is protected !!