News April 14, 2024

NLR: బస్సులో మహిళ మృతి

image

ఓ‌ మహిళ ఆర్టీసీ బస్సులోనే చనిపోయిన ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం‌ ఆదూరుపల్లి వద్ద ఆదివారం వెలుగు చూసింది. నెల్లూరు నుంచి కలువాయికి వెళ్తున్న బస్సులో ఓ‌ మహిళ అస్వస్థతకు గురైంది. ప్రయాణికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యానికి చేర్చారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 29, 2026

కావలిలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ దుర్మరణం

image

కావలి రూరల్ వెంకయ్యగారిపాలెం సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం జరిగిన ప్రమాదంలో డ్రైవర్ కోరికల అంకయ్య (53) దుర్మరణం చెందాడు. జంగారెడ్డిగూడెం నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ అంకయ్య కునుకు తీయడంతో లారీ కల్వర్టులో పడిపోయింది. రూరల్ ఎస్సై తిరుమల్ రెడ్డి కేసు నమోదు చేశారు.

News March 29, 2026

నెల్లూరు: 3వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి

image

గుంటూరులో ఓ వ్యక్తి 3వ అంతస్తు నుంచి పడి దుర్మరణం చెందాడు. నెల్లూరు(D) కోవూరు(M) ఇనమడుగుకు చెందిన అశోక్ కుమార్ రెడ్డి(29) గుంటూరులోని ముత్యాలరెడ్డి నగర్‌లో ఉంటున్నాడు. మద్యం మత్తులో ప్రమాదవశాత్తు 3వ అంతస్తు నుంచి కింద పడినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 29, 2026

రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతా: బీదా మస్తాన్ రావు

image

నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె బోట్ల మాయానికి సంబంధించి తన ప్రమేయం ఉందని ఆధారాలతో సహా ఒక్క శాతం నిరూపించినా తన స్థానానికి రాజీనామా చేస్తానని బీదా మస్తాన్ యాదవ్ ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు. నెల్లూరు నగరంలోని తన నివాసంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. కొంతమంది రాజకీయ కుట్రతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.