News April 16, 2025

NLR: యువతిని బెదిరించి చైన్ దోచుకెళ్లాడు

image

ఓ యువతిని బెదిరించి ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి లాక్కెళ్లిన ఘటన నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ వద్ద జరిగింది. బాలాజీనగర్ పోలీసుల సమాచారం మేరకు..మర్రిపాడుకు చెందిన రీమాశేఖర్ నారాయణ వైద్యశాలలో బయోమెడికల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. ఈనెల 11వ తేదీ స్నేహితుడితో చిల్డ్రన్స్ పార్క్ రోడ్డులో మాట్లాడుతుండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి బెదిరించి గోల్డ్ చైన్ లాక్కెళ్లాడు.

Similar News

News December 13, 2025

BREAKING: నెల్లూరు మేయర్ రాజీనామా

image

అనుహ్య పరిణామాల మధ్య నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించి రాజీనామా ప్రకటన చేశారు. కలెక్టర్‌ని కలిసి తన రాజీనామా పత్రాన్ని అందిస్తానని చెప్పారు. మేయర్‌గా రాజీనామా చేసినా ప్రజలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. తనను మేయర్‌ని చేసిన వైసీపీ అధినేత జగన్‌కు రుణపడి ఉంటానన్నారు.

News December 13, 2025

మరికాసేపట్లో మీడియా ముందు నెల్లూరు మేయర్

image

నెల్లూరు జిల్లాలో గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై రాజకీయం వేడెక్కింది. ఉదయం ఒక కార్పొరేటర్.. సాయంత్రం మరొక కార్పొరేటర్ మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. దీనిపై మేయర్ స్రవంతి మరికాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ఆమె ఏం మాట్లాడుతారు.. ఎవరి గురించి మాట్లాడుతారో ఉత్కంఠంగా నగర, జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.

News December 13, 2025

గోవా క్యాంపునకు నెల్లూరు వైసీపీ కార్పొరేటర్లు..?

image

కొంచెం.. కొంచెంగా నెల్లూరు వైసీపీ కార్పొరేటర్ల స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇప్పటికే 41 స్థానాలు కైవసం చేసుకున్న TDP మిగిలినవారిని లాగేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. వైసీపీ పరువు కాపాడుకొనే ప్రయత్నంలో పడిపోయింది. ఉన్న 11 స్థానాలను అయినా కాపాడుకునేందుకు గోవా క్యాంపునకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.