News September 5, 2025
NLR: హూజ్ యాప్‌తో రూ.2 కోట్లకు టోకరా..?

కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే ప్రజల ఆశను కొందరు ఆసరాగా చేసుకొని భారీగా కొల్లగొడుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో హూజ్ యాప్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. 2024లోనే ఈ యాప్ ప్రారంభమైంది. జిల్లాలో దాదాపు రూ.2కోట్లకు పైగా నగదు డిపాజిట్ చేయించుకుంది. ఈ యాప్‌లో చేరిన వారికి గత నెల 20వ తేదీ నుంచి నగదు ట్రాన్స్‌ఫర్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు వాపోయారు.
Similar News
News September 5, 2025
ఆ బాధ్యత టీచర్లదే : కలెక్టర్

జిల్లాలో మోడల్ ప్రైమరీ స్కూల్స్ ను విజయవంతం చేయాల్సిన బాధ్యత టీచర్లదేనని జిల్లా కలెక్టర్ ఆనందు తెలిపారు. ప్రభుత్వ, ప్రవేట్ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి విద్యారంగా అభివృద్ధికి దోహదపడాలన్నారు. విద్యావ్యవస్థలో వచ్చే మార్పులు దృష్టిలో ఉంచుకొని టీచర్లు శిక్షణ పొందాలని సూచించారు. కలెక్టరేట్లో జరిగిన గురుపూజోత్సవ వేడుకలలో ఆయన మాట్లాడారు. రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
News September 5, 2025
నెల్లూరు: ధాన్యం రేటు పతనంపై నిరసన

నెల్లూరు జిల్లాలో వరి పుట్టి మద్దతు ధరను ప్రభుత్వం రూ.19,720గా ప్రకటించింది. దళారులు, మిల్లర్లు కలిసి రూ.16వేలకే కొనుగోలు చేస్తున్నారని రైతు సంఘ నాయకుడు గంగపట్నం రమణయ్య ఆరోపించారు. పలుమార్లు ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని చెప్పారు. అధికారులు నిర్లక్ష్యం, మిల్లర్లు, దళారుల దోపిడిపై ఈనెల 8న రైతు సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్ ఎదుట నిరసన చేపడతామని ప్రకటించారు.
News September 5, 2025
శ్రీలంకలో కావలి మాజీ MLA..?

కావలి MLA కృష్ణారెడ్డి హత్యకు ప్లాన్ చేశారంటూ మాజీ MLA ప్రతాప్ రెడ్డిపై కేసు నమోదైంది. దీనిని కొట్టేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని కోర్టు ప్రశ్నించగా ‘ఆయన దేశంలో లేరు. శ్రీలంకలో ఉన్నట్లు దర్యాప్తు అధికారి గుర్తించారు. MLA హత్యకు ఆయన ప్లాన్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. కేసును క్వాష్ చేయవద్దు’ అని గవర్నమెంట్ లాయర్ కోరారు. ఈనెల 10కి ఈ కేసు వాయిదా పడింది.