News May 22, 2024

NLR: 100 మంది ఉద్యోగులకు నోటీసులు

image

ఎన్నికల విధులకు హాజరుకాని ప్రభుత్వ ఉద్యోగులపై నెల్లూరు జిల్లా ఎన్నికల అధికారి హరినారాయణన్ సీరియస్ అయ్యారు. పోలింగ్ రోజు విధులకు గైర్హాజరైన 100 మందికి పైగా ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధులకు ఎందుకు హాజరు కాలేదో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్న ఉద్యోగుల్లో పలువురు మంగళవారం కలెక్టరేట్‌కు వచ్చారు.

Similar News

News April 19, 2026

నెల్లూరులో నేడు బంగారం ధర ఎంతంటే?

image

అక్షయ తృతీయ కావడంతో నెల్లూరులోని బంగారు దుకాణాలు కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. నెల్లూరులో ఆదివారం గ్రాము బంగారం రూ.14,708 పలుకుతోంది. సవర(8గ్రాములు) రూ.1,17,664 చొప్పున విక్రయిస్తున్నారు. వెండి గ్రాము రూ.270.30గా ఉంది. అక్షయ తృతీయలో కనీసం గ్రాము బంగారమైనా కొనాలని పలువురు ఆసక్తి చూపుతున్నారు.

News April 19, 2026

నెల్లూరు: ఆ నిధులు ఖర్చు చేసేది ఎలా..?

image

నెల్లూరు జిల్లాలోని 700 గ్రామాల్లో రూ.39 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.33.88 కోట్లు రాబట్టారు. ఈ నిధులను ఖర్చు చేద్దామనుకొనే లోపు సర్పంచుల పదవీ కాలం ముగిసిపోయింది. స్పెషల్ ఆఫీసర్స్ వచ్చినా.. వీరికి నిధులు వ్యయంపై అవగాహన లేకపోవడం, పల్లెల ముఖం చూడకపోవడంతో నిధులు పక్కదారి పట్టే అవకాశం ఉంది. వేసవిలో నీటి కష్టాల తీర్చడానికి ఈ నిధులు ఖర్చు చేస్తే బాగుంటుంది.

News April 19, 2026

నెల్లూరు జిల్లాలో 212మంది పోలీసుల బదిలీ

image

నెల్లూరు జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న 212 మంది సిబ్బందిని ట్రాన్స్‌ఫర్ చేశారు. SP అజిత వేజెండ్ల సిబ్బందితో మాట్లాడి పారదర్శకంగా బదిలీలు చేపట్టారు. అన్ని విభాగాల నుంచి ఖాళీల వివరాలను సేకరించారు. సిబ్బంది అభ్యర్థనలు, అవసరాలను పరిగణలోకి తీసుకుని ట్రాన్స్‌ఫర్ చేశారు. బదిలీ అయిన వారిలో కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్ఐ స్థాయి వరకు ఉన్న సిబ్బంది ఉన్నారు.