News July 13, 2024

NLR: 2 నుంచి బీచ్‌ కబడ్డీ పోటీలు

image

నెల్లూరు జిల్లాలో ఆగస్టు 2, 3, 4వ తేదీల్లో 11వ ఆంధ్ర రాష్ట్ర బీచ్ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. ఇందుకూరుపేటలోని ఎంకేఆర్‌ హైస్కూల్‌ గ్రౌండ్‌ వేదికగా ఈ పోటీలు నిర్వహిస్తారు.  సంబంధిత పోస్టర్‌ను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News December 6, 2025

Way2News ఎఫెక్ట్.. స్పందించిన బుచ్చి ఛైర్ పర్సన్

image

బుచ్చి మున్సిపాలిటీ మలిదేవి బ్రిడ్జి వద్ద గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. దీంతో <<18484228>>’500 మీటర్లలో.. లెక్కలేనన్ని గుంతలు’ <<>>అనే శీర్షికన Way2Newsలో కథనం ప్రచురితమైంది. స్పందించిన బుచ్చి మున్సిపల్ ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజా మురళి మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులను శనివారం చేపట్టారు. వాహనదారులు ప్రయాణికులు, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

News December 6, 2025

నెల్లూరు: 500 మీటర్లలో.. లెక్కలేనన్ని గోతులు

image

బుచ్చి మున్సిపాలిటీ నడిబొడ్డులో మలిదేవి బ్రిడ్జి వద్ద రోడ్డుపై లెక్కలేనన్ని గోతులు ఏర్పడి రోడ్డు అధ్వానంగా మారింది. అడుగడుగునా గుంతలు ఉండడంతో రోడ్డుపై వెళ్లాలంటే కుదుపులకు వాహనాలతోపాటు,ఒళ్లు గుల్లవుతుందని ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపుదిద్దుకున్నా ప్రధాన రహదారుల రూపు మారలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

News December 6, 2025

నెల్లూరు: చక్కెర కోటాకు “కత్తెర”..!

image

జిల్లాలో రేషన్ షాపుల ద్వారా కార్డుదారులకు 1/2 కేజీ చొప్పున ఇస్తున్న చక్కెర కోటాలో ఈ నెల కత్తెర పడింది. పలుచోట్ల చక్కెరను లేదంటూ.. డీలర్లు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో 1513 రేషన్ షాపుల పరిధిలో 7 లక్షల కార్డులు ఉండగా.. వీరికి ప్రతీ నెల 3500 మెట్రిక్ టన్నులు చక్కెర సరఫరా జరుగుతోంది. అయితే నెల స్టార్ట్ అయి 5 రోజులు గడుస్తున్నా.. కొన్ని చోట్ల ఇవ్వడం లేదు.