News April 16, 2024

NLR: 2094 మంది వాలంటీర్లు రాజీనామా

image

ఎన్నికల తేదీ సమీపించే కొద్ది నెల్లూరు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్ది రోజులుగా వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంపై తీవ్ర చర్చ సాగుతోంది. పెద్దసంఖ్యలో వాలంటీర్లు రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నారు. కోవూరు నియోజకవర్గంలో పలువురు టీడీపీలోనూ చేరారు. జిల్లాలో సోమవారం నాటికి 2094 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.

Similar News

News October 7, 2025

నెల్లూరు: కేవలం 2 వేల మెట్రిక్ టన్నులే కొనుగోలు.!

image

జిల్లాలో ఎడగారు సీజన్‌కు ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే అప్పటికే 40 శాతం కోతలు సైతం అయిపోయాయన్నారు. కేవలం 2 వేలు మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. కోతలు దాదాపు పూర్తయ్యే దశలో PPC లను ఏర్పాటు చేయడంతో అన్నదాతలు బాగా నష్టపోయారు. చెప్పుకోదగ్గ స్థాయిలో ఇవి ఉపయోగపడలేదని రైతన్నలు ఆరోపిస్తున్నారు.

News October 7, 2025

నెల్లూరు: ‘మీకు తెలిస్తే చెప్పండి’

image

కలిగిరి మండలంలోని వెలగపాడు సచివాలయం ముందు గల బస్ షెల్టర్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40- 45 ఏళ్లు ఉండవచ్చని, చనిపోయిన వ్యక్తి వేసుకున్న షర్ట్ కాలర్ మీద “Pavan Men’s Wear” పామూరు అని ఉన్నట్టు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే కలిగిరి PS 9440700098 నంబర్‌కు సంప్రదించాలన్నారు.

News October 7, 2025

సమాచారం ఉంటే ఫిర్యాదు చేయండి: కలెక్టర్

image

జిల్లాలో అక్రమ యూరియా, నకిలీ విత్తనాలు ఎరువులు సంబంధించిన సమాచారం ఉంటే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు అక్రమ యూరియా నిల్వలు నివారణకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏమైనా సమాచారం ఉన్న 8331057225 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.