News March 16, 2024

NLR: తొలిసారి ఎమ్మెల్యేలుగా నలుగురి పోటీ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

Similar News

News October 31, 2025

వెంకటగిరి: బాలికపై లైంగిక దాడి.. మారుతండ్రికి జీవిత ఖైదు

image

బాలికపై మారు తండ్రి పలుమార్లు లైంగిక దాడి కేసులో నేరం రుజువు కావడంతో నిందితుడు సర్వేపల్లి అంజయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.40 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వెంకటగిరి బంగారు పేట అరుంధతి పాలేనికి చెందిన సర్వేపల్లి అంజయ్యకు ఓ వివాహితతో పరిచయం ఏర్పండి. ఈ క్రమంలో ఆమెతో ఉంటూ మహిళ 15 ఏళ్ల కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 2021 జులై 19న కేసు నమోదైంది.

News October 31, 2025

నెల్లూరు మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డిప్లొమా కోర్సులో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లోకల్ 85%, నాన్ లోకల్ అభ్యర్థులకు 15% సీట్లు కేటాయిస్తామని కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. అభ్యర్థులు రూ.100 చెల్లించి అప్లికేషన్లు తీసుకోవాలని.. నవంబర్ 7వ తేదీ లోపు కాలేజీలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు spsnellore.ap.gov.in/notice/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News October 30, 2025

సోమశిలకు పెరుగుతున్న వరద

image

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.