News April 12, 2025

NLR: అమ్మోనియం లీక్.. 10మందికి అస్వస్థత

image

నెల్లూరు జిల్లాలో అమ్మోనియం గ్యాస్ లీక్ కలకలం రేపింది. తోటపల్లి గూడూరు మండలం అనంతవరంలోని ఓ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లో గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో సుమారు పదిమంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గ్రామంలోనూ గ్యాస్ వ్యాపించడంతో స్థానికులు మాస్కులు ధరించారు. రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Similar News

News April 13, 2025

నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం

image

ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యానంలో బీచ్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. 12, 13వ తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జర్నలిస్టులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లాకు మొదటి, పశ్చిమగోదావరి జిల్లాకు రెండవ, నెల్లూరు జిల్లాకు మూడవ స్థానం వచ్చింది. రూ.5000 బహుమతి అందుకున్నారు. ఆ సంస్థ అధ్యక్షుడు ఓబులం ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని జిల్లాలలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

News April 13, 2025

రూ.2.7 కోట్లతో అభివృద్ధి పనులు: ఎమ్మెల్యే 

image

నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి బొమ్మ నుంచి డైకాస్ రోడ్డు వరకు రూ.2.7 కోట్లతో సెంటర్ లైటింగ్, డివైడర్, ఫుట్ పాత్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గాంధీనగర్ రోడ్డును ఆదివారం పరిశీలించారు. గాంధీనగర్ రోడ్డుకు మహర్దశ పట్టిందని, త్వరలోనే అత్యంత సుందరంగా నిర్మిస్తామని ఆయన తెలిపారు. 

News April 13, 2025

నెల్లూరు జిల్లాలో ఉపాధ్యాయులకు గమనిక 

image

జోన్-3 పరిధిలోని ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలలోని ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 16లోగా తెలియజేయాలని నెల్లూరు డీఈఓ బాలాజీ రావు  తెలిపారు. స్కూల్ అసిస్టెంట్ నుంచి గ్రేడ్-2 ప్రధాన ఉపాధ్యాయుల పోస్టుల కొరకు జాబితాను వెబ్సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అభ్యంతరాలను తగిన ఆధారాలతో సమర్పించాలన్నారు.

error: Content is protected !!