News April 7, 2025
NLR: ఇంటర్ అమ్మాయితో అసభ్య ప్రవర్తన

పాఠాలు చెబుతానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నెల్లూరులో జరిగింది. నగరానికి చెందిన యువతి దర్గామిట్టలోని ఓ బిల్డింగ్‌లో ఎంసెట్ కోచింగ్ తీసుకుంటోంది. అదే భవనంలోని ఇన్సురెన్స్ ఆఫీస్‌లో శ్రీనివాసులు రెడ్డి పనిచేస్తున్నాడు. కెమెస్ట్రీలో డౌట్స్ క్లియర్ చేస్తానంటూ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.
Similar News
News April 18, 2025
నెల్లూరు: 26 మందికి రూ.74.57లక్షల పంపిణీ

నేషనల్ దివ్యాంగజన్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ వారి ఆర్థిక సహాయంతో నెల్లూరు జిల్లాకు చెందిన 26 మంది దివ్యాంగులకు రూ.74,57,500 చెక్కులను జాయింట్ కలెక్టర్ కార్తీక్ పంపిణీ చేశారు. స్వయం ఉపాధి పనులు చేసుకోవడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. దివ్యాంగులు సమాజంలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ మేనేజర్ ఏ.మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు.
News April 17, 2025
నెల్లూరు: 3.69 లక్షల ఎకరాలకు సాగునీరు

నెల్లూరు జిల్లాలో 3.69 లక్షల ఎకరాల రెండో పంటకు నీరు అందించాలని ఐఏబీ సమావేశంలో తీర్మానించారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నెల్లూరులోని జడ్పీ హాలులో ఐఏబీ సమావేశం జరిగింది. 41 టీఎంసీల జలాలను రెండో పంటకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఈ విషయంలో సాగునీటి సంఘాల ప్రతినిధులు కీలకపాత్ర పోషించాలని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు.
News April 17, 2025
PM ఇంటర్న్‌షిప్‌కు నమోదు చేసుకోండి: MP

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని జిల్లా యువత సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని ఆయన కోరారు.